![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -298 లో.. అనామిక చేసిన కాఫీ బాగోలేదని ఇంట్లో వాళ్ళు చెప్పలేక ఇబ్బంది పడిన కళ్యాణ్ మాత్రం నిర్మొహమాటంగా కాఫీ బాలేదని అనామిక మొహం మీదే చెప్పేస్తాడు. దాంతో అనామిక ఫీల్ అవుతుంది. అక్కడే ఉన్న రుద్రాణి.. ఈ కావ్య, స్వప్న ఇద్దరు ఎప్పుడు వంటింటి పనులు చేసుకుంటు పెరిగారు. నువ్వు సుకుమారంగ పెరిగావ్. నీకు ఈ పనులు రావు కదా నువ్వేం ఫీల్ కాకంటూ అనామికతో రుద్రాణి చెప్తుంది. మరొకవైపు రాజ్ కి శ్వేత ఫోన్ చేయడంతో కంగారుగా రాజ్ గదిలోకి వెళ్తాడు.
అ తర్వాత కావ్య వెళ్లి అందరికి కాఫీ చేసుకొని తీసుకొని వస్తుంది..అందరు కావ్య ఇచ్చిన కాఫీని మెచ్చుకుంటు ఉంటే అనామికకి కోపం వస్తుంది. మరొకవైపు శ్వేత మళ్ళీ రాజ్ కి ఫోన్ చేస్తుంది. రాజ్ లిఫ్ట్ చేసి నేను చేసే వరకు చెయ్యకని చెప్పాను కా
దా ఎందుకు చేస్తున్నావని అంటాడు. అ తర్వాత లాయర్ డివోర్స్ గురించి మాట్లాడడానికి ఈరోజు రమ్మని చెప్పాడని శ్వేత అంటుంది. సరే త్వరగా వస్తున్నానని రాజ్ చెప్తాడు. రాజ్ త్వరగా రెడీ అవుతుంటే.. ఏంటి ఈ రోజు ఇంత తొందర అని కావ్య అడుగుతుంది. ఆఫీస్ లో వర్క్ ఉందని రాజ్ చెప్తాడు. మరొకవైపు అందరి ముందు ఇన్సల్ట్ అయిందని అనామిక ఫీల్ అవుతుంటే రుద్రాణి వచ్చి కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంది. అనామికని పూర్తిగా రుద్రాణి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కావ్య ఇంట్లో అందరిని తన గ్రిప్ లో ఉంచుకుందని రుద్రాణి చెప్తుంది. రుద్రాణి మాటలు అనామిక నమ్ముతుంది. మరొకవైపు కావ్య బయటకు వెళ్తుంటే దారిలో రాజ్ శ్వేత ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ కనిపిస్తారు.
ఆ తర్వాత రాజ్ కి కావ్య ఫోన్ చేసి.. ఎక్కడున్నారని అడుగుతుంది. ఆఫీస్ లో అని రాజ్ చిరాకుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నారని కావ్య అనుకుంటుంది. అ తర్వాత కావ్య వెళ్లే ఆటో వెనకాలే రాజ్ కార్ వస్తుంది. ఆటో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతు డ్రైవ్ చేస్తున్నాడని రాజ్ కార్ దిగి వచ్చి కావ్య ఉన్నాఆటో డ్రైవర్ తో గొడవపెట్టుకుంటాడు కానీ కావ్యని చూడడు. మరొకవైపు నేను తప్పు చెయ్యలేదని ఋజువు చేస్తే మా అత్తయ్య నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానని చెప్పింది. కనీసం నాకు ఇష్టమైనవి కూడా తీసుకొని రావడం లేదని రుద్రాణితో స్వప్న అంటుంది. స్వప్న అన్న దంట్లో న్యాయం ఉందని ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో కావ్య ఆఫీస్ కి వస్తుంది. అక్కడ రాజ్ , శ్వేత ఇద్దరు కలిసి లాయర్ తో.. మాకు విడాకులు ఇష్టమేనని అంటారు. ఆ మాట కావ్య వింటుంది. కావ్యని రాజ్ చూస్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |